15 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్.. అతని ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా...

ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. కేసులు పెరగడంతో భయానక వాతావరణం నెలకొంది. దేశంలో ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 241 మంది డిశ్చార్జ్ కాగా.. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 62 ఒమిక్రాన్ కేసులు రాగా.. 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన 15 ఏళ్ల బాలుడికి కరోనా కన్ఫామ్ అయ్యింది. అతను కుటుంబంతో కలిసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ఇంద్రానగర్‌లో ఉంటున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన అతడికి కరోనా రావడంతో జీనోమ్ సీక్వెన్సీకి పంపగా పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్దారణ అయింది.

40 మందికి పరీక్షలు

40 మందికి పరీక్షలు

బాలుడి ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చింది. వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సీకి పంపగా.. వారందరికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి కాంటాక్టులను పరిశీలిస్తున్నారు. కరోనా పాజిటివ్ వస్తే జినొమ్ సీక్వెనింగ్ పంపిస్తారు.

కేసుల పెరుగుదల

కేసుల పెరుగుదల

ఒమిక్రాన్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. వేగంగా కేసులు వ్యాపిస్తున్నాయి. ఒకరికి సోకితే.. అదీ ఫ్యామిలీ కాకుండా చుట్టుపక్కల వారికి కూడా అంటిస్తోంది. దీంతో పక్కన గల వారు కూడా భయపడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు వస్తున్నాయి.. కానీ దాని తీవ్రత ఎక్కువగా లేదు. ఇప్పటివరకు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అందరికీ నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందజేస్తున్నారు.

లాక్ డౌన్..?

లాక్ డౌన్..?

అయితే సిరిసిల్లలో రెండు గ్రామాలు స్వయంగా లాక్ డౌన్ విధించుకన్నాయి. మిగతా చోట్ల కూడా ఇలా చేస్తే ఓకే.. కేసులు ఎక్కువగా వచ్చిన హైదరాబాద్ సంగతి ఏంటీ.. ఆయా చోట్ల ఆంక్షలు విధిస్తే బాగుండేది. తొలుత టోలిచౌకీ కంటైన్మెంట్ జోన్ చేశారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలను మాత్రం అలా చేయలేదు. తర్వాత వచ్చిన వరంగల్ గురించి కూడా లాక్ డౌన్ అని.. కంటైన్మెంట్ జోన్ అని మాత్రం చేయలేదు. ఇటీవల వచ్చిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కూడా అలాంటి పరిస్థితి లేదు. చావిడి ప్రాంతంలో లాక్ డౌన్ విధించిన సరిపోయేది. లేదంటే వైరస్ కేసులు మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+