తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. ఒకరు మృతి

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,242 శాంపిల్స్‌ పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరు కోవిడ్‌తో చనిపోగా.. 171 మంది బాధితులు పూర్తిస్థాయిలో నుంచి కోలుకున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,72,987కు చేరగా.. రికవరీ కేసులు 6,65,272కు పెరిగాయి. కరోనా బారినపడి 3,969 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,746 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

164 people infect coronavirus in telangana state

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+