తెలంగాణలో కొత్తగా 1983 కరోనా కేసులు... మరో 10 మంది మృతి...

తెలంగాణలో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 858 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 10 మంది కరోనాతో మృతి చెందారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(అక్టోబర్ 6) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1181కి చేరింది. ప్రస్తుతం 26,644 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 22,134 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 2381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,74,769కి చేరింది.

1983 new coronavirus cases and 10 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 50,598 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 32,92,195కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 87,092 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.58శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 84.7శాతం ఉండగా తెలంగాణలో 86.26శాతం ఉన్నట్లు తెలిపారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 292 కేసులు నమోదవగా... రంగారెడ్డి జిల్లాలో 187,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 145 కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలో 117, కరీంనగర్‌లో 109, నల్లగొండలో 105, భద్రాద్రి కొత్తగూడెంలో 85 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Telangana COVID-19 Update : Covid-19 Total Cases Near To 2 Lakh Mark In Telangana

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+