కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 221 కేసులు... దేశంలో కొత్తగా 14,256 కేసులు

తెలంగాణలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో నమోదైన కేసులు 200 మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదైనవే. తాజాగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 632 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (జనవరి 22) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

    Journalists should be given Covid-19 vaccine jab in second phase: Satyavati Rathod

    తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,588కి చేరింది. ప్రస్తుతం 3569 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 1973 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 431 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,87,899కి చేరింది.

     214 new coronavirus cases in telangana india records 14,256 new cases

    ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.8శాతం ఉండగా తెలంగాణలో 98.16 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 36 కేసులు మోదయ్యాయి.

    ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది.మరో 152 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,184కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,03,00,838కి చేరింది. ప్రస్తుతం 1,85,662 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. గత ఏడు రోజుల్లో దేశంలో మొత్తం 13,90,592 మంది హెల్త్ కేర్ సిబ్బంది,ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు కరోనా వ్యాక్సిన్లు వేశారు.

    మొదటి దశలో 3కోట్ల మంది హెల్త్ కేర్ సిబ్బంది,ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడినవారికి,ఇతర అనారోగ్య సమస్యలున్న 50 ఏళ్ల లోపువారికి ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రెండో దశలో వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+