కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 214 కేసులు... దేశంలో కొత్తగా 14,545 కేసులు

తెలంగాణలో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో నమోదైన కేసులు 200 మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదైనవే. తాజాగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 632 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం (జనవరి 22) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1586కి చేరింది. ప్రస్తుతం 3781 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2178 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,87,468కి చేరింది.

214 new coronavirus cases in telangana india records 14,545 new cases

గడిచిన 24గంటల్లో మొత్తం 28,791 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 76,02,975కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 2,04,271 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.8శాతం ఉండగా తెలంగాణలో 98.16 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 38 కేసులు మోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428కు చేరింది.మరో 163 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,032కు పెరిగింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,02,83,708కి చేరింది. ప్రస్తుతం 1,88,688 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 10,43,534 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+