గ్రేటర్‌లో మరో 24 బస్తీ దవాఖానాలు -మంత్రి కేటీఆర్ చేతులమీదుగా
విశ్వనగరం హైదరాబాద్ లో నివసించే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెంగాణ సర్కార్ విజయవంతంగా నిర్వహిస్తోన్న 'బస్తీ దవాఖానా' ఏర్పాటులో మరో అడుగు ముందుకు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 24బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు.

గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని ఒక్కో డివిజన్‌కు రెండు చొప్పున సిటీ వ్యాప్తంగా 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వీటికితోడు కొత్తగా 24 బస్తీ దవాఖానాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో జీహెచ్‌ఎంసీ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వీటిని మంత్రి కేటీఆర్‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ . హోంమంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications