తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 2 వందల పైచిలుకు

మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,841 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 279 మందికి పాజిటివ్ వచ్చింది.అత్యధికంగా హైదరాబాదులో 172 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు వచ్చాయి. 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

 279 infected coronavirus at telangana

ఇప్పటిదాకా 7,95,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,89,680 మంది కోలుకున్నారు. 1,781 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 95వేల 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 980 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,781 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల రాష్ట్రంలో 4 వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు వచ్చాయి. 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+