దిశ ఘటన జరిగిన చోటే: చటాన్‌పల్లిలో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, బైక్‌పై వచ్చి..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ హత్య ఘటన జరిగిన చటాన్‌పల్లిలో మరో దారుణం జరిగింది. చటాన్‌పల్లి గ్రామంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

హైదరాబాద్-బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై చటాన్‌పల్లి వద్ద ఉన్న ఆశియానా హోటల్ వద్ద నాలుగేళ్ల చిన్నారి స్నేహితను కిడ్నాపర్ తన బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ఇటీవల దిశ హత్య జరిగిన ప్రాంతానికి ఈ ప్రదేశం చాలా దగ్గరగా ఉండటం గమనార్హం.

4 year old girl kidnapped in chatanpally

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి స్నేహితను చాక్లెట్ ఆశ చూపినదుండగుడు.. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని పరారయ్యాడు. దుండగుడు బాలికను అపహరించుకుని తీసుకెళ్తుండగా గమనించిన కొందరు స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఆందోళనకు గురైన స్నేహిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, స్నేహిత షాద్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లో ఎల్కేజీ చదవుతోంది. మంగళవారం మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చిన చిన్నారి.. ఇంటి ముందు ఆడుకుంటుండగా.. దుండగుడు కిడ్నాప్ చేశాడు. తమ కూతురు అపహరణకు గురికావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును వెతికిపెట్టాలని పోలీసులను వేడుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+