కరోనా కలవరం.. 435 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. గత 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించారు. 435 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు వచ్చాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

612 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,30,815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,23,884 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 2,820 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.
కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications