59 ఏళ్లు దాటితే రైతులు కారా..? వైఎస్ఆర్ టీపీ ముఖ్య నేత గట్టు రామచంద్రరావు

ఏ ఒప్పందం చేసుకుంటే దాని ప్రకారమే రైతులు ఉంటారా..? 59 సంవత్సరాలు దాటిన వారు రైతులు కారా..? మీరు అవగాహన ఉన్న వ్యక్తులే అయితే మిగిలిన రైతులకు రైతు భీమా ఎలా అమలు చేయాలో ఆలోచించండి అని వైఎస్ఆర్ టీపీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. రైతుబంధు, రైతు భీమా పథకాలు మంచివి కావు అని ఎవరూ అనడం లేదన్నారు. రైతులు అందరికీ మేలు చేయాలనేదే తమ పార్టీ ముఖ్య ఉద్ధేశం అని చెప్పారు. అధికార పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను స్వాగతిస్తున్నాం.. కానీ రైతులందరికీ రైతుభీమా, రైతుబంధు పథకాలు అందకపోతే తమ పార్టీ రైతుల తరుఫున పోరాడుతుందని చెప్పారు.

15 లక్షల మంది రైతులు

15 లక్షల మంది రైతులు

రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది రైతులకు పాస్ బుక్కులు లేక రైతుబంధు రావడం లేదన్నారు. తెలంగాణలో 66 లక్షల మంది రైతులకు రైతుబంధు అందిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. సెంటు భూమి ఉన్నా కూడా రైతు భీమా వర్తిస్తుందనే కేసీఆర్ గతంలో 32 లక్షల మంది రైతులకు మాత్రమే రైతుభీమా ప్రీమియం టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించడం ఏంటి..? ఈ ఏడాది దాదాపు 42 లక్షల మంది రైతులకు రైతుభీమా ప్రీమియం టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

24 లక్షల మంది రైతులు

24 లక్షల మంది రైతులు

మరో 24 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 59 ఏళ్ల వయస్సు పరిమితి వల్లే 35 శాతం మంది రైతులకు రైతు భీమా రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసీతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, రైతులకు 59 సంవత్సరాల వరకు మాత్రమే వయస్సు పరిమితి ఉందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎల్ఐసీలో రైతులకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా అందరికీ వర్తించేలా పాలసీలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

80 ఏళ్ల వరకు పాలసీలు

80 ఏళ్ల వరకు పాలసీలు

ఎల్ఐసీలో 80 సంవత్సరాల వరకు కూడా పాలసీలు ఉన్నాయి. ప్రీమియం డబ్బులు ఎక్కువైతే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరారు. రైతులు అందరికీ వర్తించేవిధంగా రైతుభీమా తీసుకురావాలని సూచించారు. ఆర్టికల్ 14 ప్రకారం పథకంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని చట్టాలు చెబుతున్న.. తెలంగాణలో 24 లక్షల మంది రైతులకు పథకాలు అందకపోవడం పెద్ద నేరం అన్నారు. 59 సంవత్సరాల వరకే వయస్సు పరిమితి రైతు భీమాలో ఉండటం వల్ల రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుందా అనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతోందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+