5g:హైదరాబాద్‌లో ట్రయల్ రన్.. రూ.224 కోట్ల నిధులు
నెట్ లేనిది క్షణమైనా గడవదు.. ఇక మొబైల్ నెట్ అయితే ప్రస్తుతం 4 జీ అందుబాటులో ఉంది. 2జీ నుంచి 3జీ తర్వాత 4 జీ సర్వీసును ప్రొవైడర్లు అందిస్తున్నాయి. ఏదో మొబైల్ చూడటం అయితే ఓకే.. కానీ డౌన్ లోడింగ్ అంటే కష్టమే మరీ.. దీంతో ఇళ్లు/ ఆఫీసులలో వైఫై యూజ్ చేస్తున్నారు. అయితే 5జీ గురించిన అప్ డేట్స్ వస్తున్నాయి. 4జీ కన్నా చాలా వేగంగా ఉంటుందని సర్వీస్ ప్రొవైడర్లు.. నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో యువత 5జీ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ స్పీడ్ కోసం వారు నిరీక్షిస్తున్నారు.

5జీ నెట్ వర్క్..
5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో విశ్వనగరి హైదరాబాద్ కూడా ఉంది. 5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని.. డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని టెలికం శాఖ తెలిపింది. ఎయిర్ టెల్, జియో, వోడో ఫోన్ ఐడియా సంస్ధలు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, గురుగావ్, పూణే, బెంగుళూరు, చండీగఢ్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో మరియు గాంధీ నగర్ వంటి పెద్ద నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.

రూ.224 కోట్ల నిధులు
వచ్చే ఏడాది ఆయా నగరాల్లో మొదటగా 5జీ సర్వీసులను తీసుకురానున్నారు. 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్‌కు టెలికం విభాగం రూ. 224 కోట్ల రూపాయల మేర నిధులు అందిస్తోంది. ఐఐటీ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కాన్పూర్, బెంగుళూరుతోపాటు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాంటి 8 సంస్ధలు దీనిపై గత 3 ఏళ్లుగా పని చేస్తున్నాయి.

సిగ్నల్, స్పీడ్
సిటీలో 5జీ నెట్ వర్క్ పరీక్షిస్తున్నారు. సిగ్నల్, స్పీడ్ అంచనా వేస్తారు. అన్నీ అంశాలను పరిశీలించి నివేదిక రూపొందిస్తారు. దాని ఆధారంగా ఎప్పటినుంచి 5జీ అందుబాటులోకి రానుందో తెలియనుంది. మరోవైపు ఇప్పటివరకు ఉన్న 4జీ సిగ్నల్స్ వద్ద 5జీ ట్రయల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని కోసం మరో కేబుల్ వేయాలా..? లేదా అనే అంశంపై స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications