తెలంగాణలో తగ్గుముఖం: 657 కేసులు.. ఇద్దరు మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. 578 మంది బాధితులు చికిత్స నుంచి కోలుకొన్నారు. వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,093కు పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 6,29,986 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా 9,314 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవాళ్టితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 3,793కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ 1,16,815 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.96 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications