ఆటో పై 72 చాలన్లు, 12 వేల జరిమానా
హైద్రబాద్ లో ట్రాఫిక్ పోలీసుల సంగతి తెలియని కాదు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వారిపై కోరాఢా ఝలిపిస్తున్నారు. ఓ వైపు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూనే మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నవారిపై ఫోటో క్లిక్ మనిపించి చాలన్లమీద చాలన్లు పంపిస్తారు.ఆ చాలన్లే కదా అని లైట్ గా తీసుకుంటే మాత్రం సంబంధిత వాహన యజనానులు జైలుకు ,ఇక వాహానాలు స్టేషన్ కు పంపిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే నగరంలోని ఓ ఆటో డ్రైవర్ కు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 72 చాలన్లు విధించారు హైద్రబాద్ ట్రాఫిక్ పోలీసులు ,అయినా ఆ ఆటో డ్రైవర్ యథేఛ్చగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతుండడంతో ఈరోజు తనీఖీల్లో భాగంగా ఆటోను గుర్తించి పట్టుకున్నారు.

టీఎస్ 07 యూసి 1584 అనే అటోను హైద్రబాద్ లోని మాదాపూర్ బయోడైవర్సీటి సెంటర్ లో తనీఖీ చేస్తున్న పోలీసులకు ఆ ఆటో డ్రైవర్ చిక్కాడు .దీంతో పెండింగ్ చాలన్లు చెక్ చేసిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. సంబంధిత ఆటో నంబర్ పై 72 పెండింగ్ చాలన్లతోపాటు రూ 12,830 జరిమానాలు ఉన్నాయి .దీంతో ఆటోను సీజ్ చేసి పోలీస్ట్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.












Click it and Unblock the Notifications