తెలంగాణలో భారీగా తగ్గుముఖం: నిన్నటికన్నా తక్కువ.. నలుగురు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,02,761 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 731 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 772 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజులో 41 కేసులు తగ్గాయి. రాష్ట్రంలో దాదాపు రోజుకు 30 నుంచి 40 కేసుల వరకు తగ్గుకుంటూ వస్తున్నాయి.
ఇక అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెలుగుచూశాయి. ఖమ్మం జిల్లాలో 64, నల్గొండ జిల్లాలో 56 కేసులను గుర్తించారు. 993 మంది కరోనా నుంచి కోలుకోగా, వైరస్ సోకిన నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,714 మంది కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,29,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,14,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 11,206 మంది చికిత్స పొందుతున్నారు.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications