Hyderabad: జిమ్ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్.. 24 ఏళ్ల వయస్సులోనే గుండె పోటు..
24 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు.
కొద్ది సంవత్సరా క్రితం వయస్సు మీద పడిన వారికి, స్థూలకాయం ఉన్న వారికి గుండె పోటు వస్తుండేది. కానీ ఇప్పుటు వయస్సు, ఊబకాయంతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ బోయిన్ పల్లిలో 24 ఏళ్ల విశాల్ అనే
కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.

ఆసిఫ్ నగర్
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న అతను శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతి చిన్న వయస్సులోనే అతనికి గుండె పోటు రావడం భయాందోళన కలిగిస్తోంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి.

పునీత్, తారకరత్న
నటుడు పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో హార్ట్ ఎటాక్ తో చిన్న వయస్సులో కన్ను మూశారు. రెండు రోజలు క్రితం హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో అందరితో నవ్వుతూ పలకరిస్తూ కూర్చుని కుప్పకూలిన ఘటన మరువకముందే ఇవాళ విశాల్ కూడా చిన్ని వయసులోనే చనిపోవడం అందరు ఆలోచించాల్సిన విషయం.

30 ఏళ్ల యువకుడు
విజయవాడ చెందిన 25 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ విధుల్లోనే ఉంటాడు. ఇటీవల ఛాతీ నొప్పికి గురవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ యువకుడిని పరీక్షించి గుండె పోటు వచ్చిందని చెప్పారు. అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికాడు. హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు విడిచాడు.

కారణాలు
చిన్న వయస్సులోనే గుండె పోటు రావడానికి వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం. ఫాస్ట్‌ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం కారణాలుగా చెబుతున్నారు.
.
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications