Hyderabad: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో డ్రైవ్-ఇన్ థియేటర్.. త్వరలో అందుబాటులోకి..!

శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో డ్రైవ్-ఇన్ థియేటర్ త్వరలో అందుబాటులోకి రానుంది

భారతదేశపు మొట్టమొదటి డ్రైవ్-ఇన్ థియేటర్, ఆక్వా గోల్ఫ్ సదుపాయం త్వరలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏరో ప్లాజాలో అందుబాటులోకి రానుంది. పెద్ద స్క్రీన్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కార్లలో ఉండి స్క్రీన్ పై సినిమా చూడొచ్చు. ఎయిర్ పోర్టు నిర్వహకులు రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఏరోప్లాజా గత ఏడాది ప్రయాణికుల కోసం ప్రారంభించారు.

గేమింగ్ అనుభవం

గేమింగ్ అనుభవం

ఇందులో ఉచిత రోమింగ్ VR గేమింగ్ అనుభవం, స్థానిక, అంతర్జాతీయ F&B బ్రాండ్‌లు, గో కార్టింగ్, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ ఏరోప్లాజాలోనే డ్రైవ్-ఇన్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్‌లోని ఈ మొదటి డ్రైవ్-ఇన్ థియేటర్ ఇప్పటికే ఏర్పాటు చేయగా.. దీన్ని త్వరలో శాశ్వతంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

టిక్కెట్ ధరలు

టిక్కెట్ ధరలు

డ్రైవ్-ఇన్ థియేటర్ సినిమా అభిమానులకు ఇది మరపురాని అనుభూతి ఇవ్వనుంది. విమానాశ్రయంలోని సుందరమైన పరిసరాలు సినిమాలకు అనువైన నేపథ్యంగా పనిచేస్తాయి, వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. శంషాబాద్ విమానాశ్రయంలోని ఈ డ్రైవ్-ఇన్ థియేటర్ ఖచ్చితమైన సాయంత్రం గడపడానికి ఒక ప్రత్యేకమైన, వినోదాత్మక మార్గంగా ఉండనుంది. దీని ప్రారంభ తేదీ, టిక్కెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు.

34 మిలియన్ల మంది

34 మిలియన్ల మంది

RGIA ప్రస్తుతం విస్తరణలో ఉంది, ఇది మొత్తం వైశాల్యాన్ని 10,569 sq m నుంచి 29,685 sq m కి పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం 34 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్ట్‌లో గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్‌మెంట్ (GSE) సొరంగం కూడా ఉంది, ఇది భారతదేశంలోని ఏ విమానాశ్రయానికైనా ఇదే మొదటిది అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+