Dating Apps: డేటింగ్ పేరుతో డబ్బులు దోపిడీ చేస్తున్న ముఠా..
డేటింగ్ యాప్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తప్పుడు ఫొటోలతో డేటింగ్ యాప్ లోకి వస్తుంటారు. డేటింగ్ యాప్ లో మహిళలే కాదు.. ట్రాన్స్ జండర్స్ కూడా వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో ట్రాన్స్ జెండర్ల పేరుతో ఓ ముఠా డబ్బులు గుంజుతోంది. ఈ ముఠా డేటింగ్ యాప్ లో కొందరికి వల వేసి వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇలానే బంజారాహిల్స్ లో దోపిడీకి పాల్పడింది ఆ ముఠా.. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు అయింది.
హైదరాబాద్ చెందిన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ యాప్ లో ఈ ముఠా చాట్ చేసింది. తమను కలవాలని ఫలాన అడ్రస్ రావాలని కోరింది. వారు రాగానే వారి నుంచి డబ్బులు కాజేసింది. ట్రాన్స్ జెండర్ల ముఠా ఇద్దరు వ్యక్తులను డేటింగ్ యాప్ లో ఆకర్షించింది. వారని బంజారాహిల్స్ భోలానగర్ ప్రాంతాలని వస్తే మీకు కావాల్సింది ఉంటుందని చెప్పింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు భోలానగర్ ప్రాంతానికి వెళ్లారు. దీంతో వారిని ఈ ముఠా దుస్తువులు విప్పలని కోరింది. దీంతో వారు దుస్తువులు తీసేశారు.

ఆ ముఠా వారిని వీడియో దోంగచాటుగా వీడియోలు తీసింది. ఆ తర్వాత ఆ వీడియోలు చూపిస్తూ బాధితులను బెదిరించింది. బాధితుల నుంచి డబ్బులు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. దీని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠా ఇదే తరహాలో చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేటింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డేటింగ్ యాప్ యువకులను తెలివిగా ఉచ్చులోకి లాగుతాయి.
ఈ డేటింగ్ యాప్ లకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం. అందమైన అమ్మాయిల ఫొటోలను ఉపయోగిస్తారు. ఎవరైనా దీనికి ఆకర్షితులై యాప్ డౌన లోడ్ చేసుకుంటారు. అందులో అందమైన అమ్మాయిల ఫొటోలు ఉంటాయి. చాట్ చేయాలంటే కొంత మొత్తం చెల్లించాలని షరతు పెడతారు. ఆ తర్వాత వీడియో కాల్ చేయాలంటే మరింత మొత్తం చెల్లించాలని చెబుతారు. ఇలా కోట్లు కొగోడుతుంటారు. డేటింగా యాప్ ఎక్కువగా చైనాకు చెందినవే ఉన్నాయట. చైనాకు చెందిన లామోర్ డేటింగ్‌యాప్ మన దేశంలో గతేడాది రూ.199 ప్యాకేజీల పేరిట దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసిందట.
ఈ లెక్కన మిగిలిన డేటింగ్ యాప్‌లు ఇంకెంత సంపాదించి ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. డేటింగ్ యాప్స్ ద్వారా ఏటా మోసపోతున్న మొత్తం రూ.2,394 కోట్లుగా ఉంటుందని అంచనా.












Click it and Unblock the Notifications