సాఫ్ట్‌వేర్ పెళ్లికొడుకు ఆత్మహత్య.. కళ్యాణ మండపంలోనే దారుణం

హైదారాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ‌లో ఓ విషాదం చేటు చేసుకుంది. పెళ్లి చేసుకునేందుకు మంటపానికి వచ్చిన వరుడు శవమై తేలాడు. ఇంట్లో అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకుని మరికాసేపట్లో పెళ్లి బంధంతో ఒక్కటైయ్యోందుకు పెళ్లికొడుకుగా అయి ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాడు. ఇక వదువు తో పాటు ఇతర బంధువుల కోసం వేచి చూసే సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. కొద్ది సేపట్లోనే వివాహం చేసుకోవాల్సిన వరుడు మండపంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముస్తాబై ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్న వరుడు

ముస్తాబై ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్న వరుడు

హైదారాబాద్ దిల్‌సుఖ్‌నగర్ లో నివాసం ఉంటున్న సందీప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటివల నగరంలోని పేట్‌బషీర్ బాగ్‌కు చెందిన, సాఫ్ట్‌వేర్ యువతితో పెళ్లి నిశ్ఛయం అయింది. దీంతో నేడు కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ పెళ్లికొడుకుగా ముస్తాబు అయి ఉదయమే ఫంక్షన్‌ హల్‌కు చేరుకున్నాడు.

మండపం గదిలోనే ఆత్మహత్య చేసుకున్న వరుడు

మండపం గదిలోనే ఆత్మహత్య చేసుకున్న వరుడు

అనంతరం ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నారు. మరి కాసేపట్లో జరిగే పెళ్లికి అటు పెళ్లి కూతురు సైతం మరో గదిలో రెఢి అవుతోంది. దీంతో అయితే పెళ్లి కొడుకు చాల సమయం అవుతున్నా ఎంతకి బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచిన కుటుంబసభ్యులు షాక్‌కు గురైయ్యారు. పెళ్లి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో ఫంక్షన్‌హాల్ అంతా ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. దీంతో సమాచారం పెళ్లి కూతురుకు తెలపడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న బంధువులు

ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న బంధువులు

కాగా ఇదేమీ తెలియని బంధువులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అంక్షింతలు వేయాల్సిన వారు ఆశ్రునయనాలతో వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా సందీప్ తండ్రి శ్రీనివాస చారీ భువనగిరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సందీప్ ఎందుకు మండపం వరకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక కొంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+