Fire Accident: హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షోరూమ్‍లో మంటలు..
హైదరాబాద్ లోని హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హబ్సీగూడ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ భవనంలోని 2, 3 అంతస్థుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్ లో మొదటగా అగ్నిప్రమాదం సంభవించగా.. అది అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ కు కూడా వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అర్పుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఆ భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అన్ లిమిటెడ్ షాపింగ్ మార్ కింద రెమండ్, జాకీ షో రూములు కూడా ఉన్నాయి. ఇవి కూడా బట్టల దుకాణాలు కావాడంతో మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో స్థానికంగా పొగ కమ్మేసింది. ఉప్పుల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ప్రయాణికులు పొగతో ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా నివాసం ఉండేవారు కూడా పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అగ్నిప్రమాదంతో ఉప్పల్ సికింద్రాబాద్ మార్గంలో హబ్సీగూడ చౌరస్తా వద్ద కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ కు దగ్గరలోని పెట్రోల్ బంక్ ఉంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది అత్యంత జాగ్రత్త మంటలు అర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మరో ఘటనలో బట్టల గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ని ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ చెలరేగిన మంటల్లో ఆరుగురు మృతి చెందారు. కాంప్లెక్స్ లోని ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో కాంప్లెక్స్ లోని పలు ఆఫీస్‌లు, షాప్‌లు దహనమయ్యాయి. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉండటంతో ప్రాణనష్టం జరిగింది. అంతకు ముందు దక్కన్ మాల్ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications