Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: గదిలో ఆత్మహత్య చేసుకున్న లవర్స్.. రెండు రోజుల తర్వాత..!

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆకెల శ్యామ్ (24), జ్యోతి (22)గా గుర్తించారు. వారి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లేందుకు తాళం వేసి ఉన్న తలుపులు పగులగొట్టి చూడగా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఆకుల శ్యామ్, పోతుల జ్యోతి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే జ్యోతికి ఇప్పటికే పెళ్లి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. ఈ క్రమంలో శ్యామ్ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే శ్యామ్ భీమవరంలో ఉంటున్నాడు. జ్యోతి హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ కాలనీలోని ఓ హాస్టల్​లో ఉంటుంది.

A loving couple committed suicide at KPHB in Hyderabad

ఈనెల 12వ తేదీన శ్యామ్ హైదరాబాద్ ​కు వచ్చాడు. జ్యోతిని కలిసి ఆమెను తన స్నేహితుడు కేపీహెచ్ ​బీ కాలనీలోని వంశీకృష్ణ గదికి తీసుకెళ్లాడు. అయితే వంశీకృష్ణ తన వివాహం ఉండటంతో, ఆ ఇద్దరికి గదిలో ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. శ్యామ్, జ్యోతి శుక్రవారం నుంచి ఆ గదిలోనే ఉంటున్నారు. సోమవారం వారుంటున్న గదిలో నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో పక్క రూమ్ వారు చూడగా.. వారు చనిపోయినట్లు గుర్తించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్ధలు కొట్టి.. లోపలికి వెళ్లి చూడగా జ్యోతి పురుగుల మందు సేవించి నిర్జీవంగా కనిపించింది. శ్యామ్ ఫ్యాన్ ​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరో ఘటనలో భార్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన బోల్లంపల్లి శ్యాంసుందర్​ కు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ​ చెందిన శారద 2021లో పెళ్లైంది. అయితే భార్య భర్తల మధ్య గొ డవలు జరగడంతో ఏడు నెలల నుంచి శారద హుస్నాబాద్ లోని తన పుట్టింటిలోనే ఉంటుంది. ఆమె కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుంది. మనస్థాపంతో ఉంటున్న శ్యాంసుందర్.. భార్య శారద ఆత్మహత్య చేసుకున్న చోటే పురుగుల మందు బలవన్మరాణానికి పాల్పడ్డాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+