Hyderabad: హైదరాబాద్ వాసులను వణికిస్తున్న హార్ట్ ఎటాక్‍లు.. బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి..!
హైదరాబాద్ లాలాపేట్ లో ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు.
హైదరాబాద్ లో గుండె పోట్లు దడ పుట్టిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువకులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్ బోయిన్ పల్లిలో 24 ఏళ్ల విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న అతను శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

హల్దీ
40 ఏళ్ల మహ్మద్ రబ్బానీ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. అతను 'హల్దీ' వేడుకలో వరుడి పాదాలపై పసుపును పూయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారికి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన అక్కడున్న వారు అతడిని పైకి లేపారు. ఆస్పత్రికి తరలించగా.. మరోసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

లాలాపేట్
తాజాగా సికింద్రాబాద్ లాలాపేట్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ.. పరమేష్ యాదవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లాలాగూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం పరమేష్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకు తరలించారు. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటుతో పరమేష్ చనిపోయినట్లు తెలుస్తోంది.

తారకరత్న
నటుడు పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో హార్ట్ ఎటాక్ తో చిన్న వయస్సులో కన్ను మూశారు. రెండు రోజలు క్రితం హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో అందరితో నవ్వుతూ పలకరిస్తూ కూర్చుని కుప్పకూలిన ఘటన మరువకముందే ఇవాళ విశాల్ కూడా చిన్ని వయసులోనే చనిపోవడం అందరు ఆలోచించాల్సిన విషయం.

30 ఏళ్ల యువకుడు
హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు విడిచాడు.చిన్న వయస్సులోనే గుండె పోటు రావడానికి వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం. ఫాస్ట్‌ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం కారణాలుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications