హైదరాబాద్‌లో అమానుషం: అందుకే తమ్ముడిని ముక్కలుగా నరికామంటూ అన్నాచెల్లెలు

హైదరాబాద్: నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి 10.45 గంటల సమయంలో లంగర్‌హౌస్ మిలటరీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న కాలిబాటపై రక్తం కారుతున్న ఓ గోనె సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ గోనె సంచిలో ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూశాయి.

అంత్యక్రియలకు డబ్బుల్లేకే అమానుషం

మద్యానికి బానిసై చనిపోయిన సొంత సోదరుడు ఆశోక్ అంత్యక్రియలకు డబ్బుల్లేక ముక్కలు ముక్కలుగా చేసి గోనె సంచిలో పడేశామని చెప్పారు అతని సోదరి, సోదరుడు స్వరూప, రాజు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే స్వచ్ఛంధ సంస్థలకు సమాచారం ఇవ్వొచ్చు.. పోలీసులకు చెప్పొచ్చు.. అలా కాకుండా సోదరుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. ఓ మూటలో పెట్టడంపై అనుమానాలు వ్యక్తమఅవుతున్నాయి.

 A man dead body parts found in Langar Houz in Hyderabad.

ఒక వేళ అశోక్ సహజంగా చనిపోయినట్లు అయితే.. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియకుండా.. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొంత తమ్ముడు చనిపోతే.. అది కూడా అనారోగ్యంతో చనిపోయినట్లయితే.. ఎందుకు బంధువులకు సమాచారం ఇవ్వలేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లే చంపి కట్టుకథలు చెబుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా, మృతుడి సోదరి, సోదరుడిపై హత్య కేసు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నిందితులు రాజు, స్వరూప. తమ సోదరుడు అనారోగ్యంతోనే చనిపోయాడని.. తాము చంపలేదని అంటున్నారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరిని(మృతుడి సోదరి, సోదరుడు) సీసీ కెమెరాల అధారంగా పట్టుకున్నారు. చనిపోయిన ఆశోక్ కు వీరు సోదరి, సోదరుడు అవుతారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనారోగ్య కారణంగా అశోక్ మృతి చెందాడని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు చెబుతున్నారు. మృతుడు అశోక్ గతంలో డాన్ బాస్కో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాడు. లాభం లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లామని నిందుతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

అదేమాట చెబుతున్న మృతుడి సోదరి, సోదరుడు

ఇంట్లో మృతి చెందిన ఆశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేక అతని బాడీని పారేయటానికి ముక్కలుగా నరికానని అతని సోదరుడు రాజు విచారణలో వెల్లడించాడు. అతనిపై పోలీసులు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆశోక్ నిజంగానే మద్యానికి బానిసై చనిపోయడా? లేక అతని సోదరి, సోదరుడు ఆశోక్ ను చంపేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+