Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిన వ్యక్తి
కరోనా తర్వాత గుండె పోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు బారిన పడుతున్నారు. ఐదేళ్ల పిల్లలు మొదలకుకొని వృద్ధుల వరకు హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గతంలో 40,50 సంవత్సరాల పైబడిన వారికే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొన్ని నెలల క్రితం పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థిని గుండె నొప్పి చనిపోయింది. గత సంవత్సరం హైదరాబాద్ లో ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ మృతి చెందాడు.
గతేడాది ఓ వ్యక్తి పెళ్లికి ముందు నిర్వహించే హాల్ది కార్యక్రమంలో పాల్గొన్నాడు. పెళ్లి కుమారుడికి పసుపు పెడుతూనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఓ యువకుడు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండె పోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది. స్థానిక టెంపుల్ బస్ స్టాప్ దగ్గర హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఓ యువకుడు దేవుడి దర్శనం కోసం గుడి వచ్చిన కన్నుమూశాడు.

స్థానికంగా నివాసం ఉండే 31 ఏళ్ల విష్ణువర్ధన్ సోమవారం ఉదయం హనుమాన్ దేవాలయానికి ముందుగా ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాడు ఒక చుట్టూ తిరిగి రెండో సారిగేందుకు వెళ్తున్న సమయంలో పిల్లర్ ను పట్టుకున్నాడు. ఆ తర్వాత కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు గమనించారు. విష్ణవర్ధన్ కు సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి గుడిలోనే తుది శ్వాస వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు.
గుడిలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి#HeartAttack #CardiacArrest #గుండెపోటు #Oneindiatelugu pic.twitter.com/LYFuSSPk5q
— oneindiatelugu (@oneindiatelugu) November 12, 2024
విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ పడిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications