హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Crime News: హీరో మహేష్ బాబు ఇంట్లో చోరీకి ఆగంతకుడి యత్నం.. 30 అడుగల గోడపై నుంచి..

|
Google Oneindia TeluguNews

సినీ హీరో మహేశ్‌బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతుకుడు వచ్చాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.81లో మహేష్‌బాబు కుటుంబంతో ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ వద్ద పెద్ద శబ్దం వచ్చింది. ఆగంతకుడు ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయలయ్యాయి.

గాయాలపాలై
శబ్దం విని సెక్యూరిటీ సబ్బంది వెళ్లి చూడగా ఓ వ్యక్తి మూలుగుతూ గాయాలపాలై పడి ఉన్నాడు. అతన్ని వెంటనే పట్టుకొని విచారించిన సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్ కు తరలించి విచారించారు. నిందితుడు మూడు రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు.

A man was injured after trying to steal from hero Mahesh Babus house

ఆసుపత్రికి తరలింపు
అతడు మహేష్ బాబు ఇంటి సమీపంలో ఉన్న ఒక నర్సరీ వద్ద ఉంటున్నాడని తెలిసింది. చోరీ కోసం వచ్చిన అతను 30 అడుగుల ప్రహరీ గోడపైనుంచి దూకాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. నిందితుడిని కృష్ణ(30)గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం కృష్ణను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేనట్లు తెలిసింది.

English summary
A man tried to steal from Mahesh Babu's house in Jubilee Hills Road No.81, Hyderabad. But he got injured from a 30 feet wall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X