దారుణం: భార్య గొంతుకోసి, భవనంపైనుంచి తోసేసిన కానిస్టేబుల్

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కుంచపు రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను గొంతకోశాడు. ఆ తర్వాత భవనం మొదటి అంతస్తు నుంచి ఆమెను కింపడేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతని భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ ఆరా తీశారు. కాగా, నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. నిందితుడు రాజ్ కుమార్ హైకోర్టులోని 4వ గేట్ వద్ద కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

constable

హత్యకు గురైన కానిస్టేబుల్ భార్య శోభ కుటుంబసభ్యులు, బంధువులు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దంపతుల మధ్య గొడవలు గతంలోనూ జరిగాయని.. అయితే, ఓ పోలీస్ ఉన్నతాధికారి నచ్చచెప్పడంతోనే శోభను కాపురానికి పంపామని.. ఇప్పుడు తమ కూతురిని లేకుండా చేశారని ఆమె తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

కాగా, కానిస్టేబుల్ రాజ్ కుమార్, శోభ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తన తల్లిపై తండ్రి కత్తితో దాడి చేసి.. ఇంటిపైనుంచి తోసేసి చంపాడని ఆ బాలుడు తెలిపాడు. తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో సంవత్సర కాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు. తన తండ్రిని అడ్డుకోవడంతో తనపై కూడా కత్తితో దాడి చేశాడని తెలిపాడు. తన తల్లిని చంపిన తండ్రి రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆ బాలుడు పోలీసులను కోరాడు.

వనస్థలిపురంలో కారు బీభత్సం: ఒకరికి తీవ్ర గాయాలు

వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు.. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు స్పీడోమీటర్‌ చూపిస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+