అబార్షన్ కోసం హోమియో వైద్యం.. వికటించడంతో ప్రాణాలు...

అబార్షన్‌ చేసుకోవడంపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా... అసుపత్రుల్లో మాత్రం ఎలాంటీ మార్పు రావడం లేదు. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న హైదరాబాద్ మహానగరంలో అంతే వేగంగా అబార్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటివల నగర శివారులో కాలువలు క్లీన్ చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి గుట్టలు గుట్టలుగా శిశువుల శవాలు బయటపడిని దుస్థితి కనపడింది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రసూల్‌పురకు చెందిన ఓ గర్భవతి అబార్షన్ చేయించుకునేదుకు హోమియో వైద్యుడి వద్దకు వెళ్లింది. క్లినిక్‌లో హోమియో వైద్యుడు నిబంధనలకు విరుద్దంగా మహిళకు అబార్షన్‌కు కోసం మందులు ఇచ్చాడు. దీంతో క్లినిక్‌లోనే మందులు వేసుకున్న మహిళ అనంతరం ఇంటికి బయలు దేరింది. ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన కాసేపటికే విపరీతమైన కడుపునొప్పి లేవడంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లో ఉన్న బాత్రూంకు వెళ్లింది.దీంతో బాత్రూంలోనే శిశువు ప్రసవించింది.

A pregnant woman gave a birth to baby in bathroom, when she was trying to get abortion.

అయితే శిశువును ప్రసవించిన మహిళ అక్కడే పడవేసి తీవ్ర రక్త స్రావంతో బయటకు వచ్చింది. ఇది గమనించిన ఇంటి యజమాని బాత్రూంలో శిశువు ఉన్న విషయాన్ని గమనించాడు. అదే వీదిలో సంబంధిత డాక్టరు ఉండడంతో విషయాన్ని చేరవేశాడు. వైద్యుడు వచ్చి చూశాడు. అయితే అప్పటికే శిశువు మృతి చెందడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వివరాలు సేకరించి కేసును నమోదు చేశారు. ఇక విషయం తెలుసుకున్న హోమియో వైద్యుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+