Heart Attack: గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..
గుండె మరణాలు క్రమంగా పెరుగుతోన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఏపీలోని విశాపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా చేస్తున్నాడు.
అతను గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్నారు. శనివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడానికి ఘట్టుపల్లి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న క్రమంలో అలసిపోయాడు. ఇక ఆడే ఓపిక లేక మధ్యలోనే వెళ్లి కూర్చున్నాడు. భార్గవ్ కూర్చున్న చోటే సొమ్మసిల్లి పడిపోయాడు. స్నేహితులు లేపినా లేవలేదు. దీంతో అతన్ని ముచ్చింతల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే భార్గవ్ అప్పటికే చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్య గుండె పోటు మరణాలు భారీగా పెరుగుతోన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ కుప్పకూలిపోయి చనిపోయాడు. గతేడాది అక్టోబర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందారు. 12 ఏళ్ల అదరంగి మైథిలి దసరా సెలవులకు ఇంటికివచ్చిన రోజే గుండెపోటుతో చనిపోయింది.
గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి గుండెపోటుతో చనిపోయింది. సెప్టెంబర్ 25 న, జామ్‌నగర్‌లోని ఒక తరగతిలో గర్బా డ్యాన్స్ స్టెప్పులు రిహార్సల్ చేస్తూ 19 ఏళ్ల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి కుప్పకూలిపోయాడు. సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి వయస్సు 25 ఏళ్ల లోపే ఉంటుంది.












Click it and Unblock the Notifications