Viral Video: గల్లీల్లో కూడా హెల్మెంట్ పెట్టుకోవాలా.. ఈ వీడియో చూసి డిసైడ్ కండి..

చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ముఖ్యంగా హెల్మెంట్ ధరించడానికి ఇష్టపడరు. మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు ఫైన్ పడుతుందని హెల్మెంట్ పెట్టుకుంటారు. కానీ గల్లీలు, చిన్న చిన్న రోడ్లలో హెల్మెంట్ ఎందుకని ధరించరు. అయితే ఎక్కడికి వెళ్లినా హెల్మెంట్ తప్పకుండా ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఫేస్ బుక్ లో

ఇందుకు సంబంధించి ఓ వీడియో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. అతని ముందు కారు, వ్యాన్ వెళ్తోంది. అతను కారు, వ్యాన్ ఓవర్ టెక్ చేయాలని స్పీడ్ గా వచ్చాడు. అప్పుడే ఎదురుగా ఆటో వచ్చింది. దీంతో అతను అదుపు తప్పి కింద పడ్డాడు. వ్యాన్ టైర్ అతని తలపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

గల్లీల్లో

గల్లీల్లో


అతను ఆ సమయంలో హెల్మెంట్ పెట్టుకోలేదు. అయితే అతను హెల్మెంట్ స్కూటీలో పట్టుకున్నాడు కానీ తలకు ధరించలేదు. ఈ ప్రమాదానికి అతను హెల్మెంట్ ధరించకపోవడం, గల్లీల్లో ఓవర్ టెక్ చేయడం, స్కూటీ ఫ్రంట్ బ్రేక్ వేయడం కారణమని ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఎక్కడికి ద్విచక్ర వాహనంపై వెళ్లినా హెల్మెంట్ ధరించాలని చెప్పారు.

సెప్టెంబర్ 19న

సెప్టెంబర్ 19న


ఈ రోడ్డు ప్రమాదం రాజేంద్రనగర్ లో జరిగింది. సెప్టెంబర్ 19న ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+