ఒంటరి మహిళపై గ్యాంగ్‌రేప్, పొదల్లోకి తీసుకెళ్లి దారుణ హత్య

ఆసిఫాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

లింగాపూర్ మండలం ఎల్లపటార్ గ్రామ శివారులో ఈ దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మఋతురాలు ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన టేకు లక్ష్మిగా గుర్తించారు.

A woman allegedly raped and murdered in Asifabad district

బెలూన్లు అమ్ముకుంటూ సంచరించే లక్ష్మి ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు లింగాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓ బైక్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వారికి చెప్పడంతో ఆందోళన విరమించారు. ఘటనా స్థలానికి ఆసిఫాబాద్ డీఎస్పీ చేరుకుని పరిశీలించారు. కాగా, తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+