Cyber Fraud: యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయాలంటూ రూ.కోట్లు కొట్టేశారు..

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరాలు కూడా అంతగా పెరుగుతోన్నాయి. సైబర్ కేటుగాళ్లు ఒక్కో స్టైల్ లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. చదువుకున్న వారే సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు మహిళ వ్యాపారిని మోసం చేసి ఏకంగా రూ.2.7 కోట్లు దోచుకున్నారు.

52 ఏళ్ల మహిళ వ్యాపారి సైబర్ క్రూక్స్ వలలో చిక్కుకుని ఇంత డబ్బు కోల్పాయారు. ఆమెకు ఒక రోజు యూట్యూబ్ ఛానెల్ కు లైక్ చేయడం ద్వారా సింపుల్ గా డబ్బులు వస్తాయి సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది. ఓ లింక్ కూడా వచ్చింది. ఆమె లింక్ పై క్లిక్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో యాడ చేశారు. అవతలి వారు అంటే సైబర్ కేటుగాళ్ల పంపించిన యూట్యూబ్ వీడియోలకు లైక్ చేశారు.

A woman was cheated of Rs 2 7 crore by cyber criminals

ఇలా కొన్ని వీడియోలకు లైక్ చేయగా.. డబ్బులు వచ్చాయి. సులభంగా డబ్బులు రావడంతో ఇదేదో బాగానే ఉంది కదా అనుకున్నారు. వీలైనన్ని ఎక్కువ యూట్యూబ్ వీడియోలకు లైక్ చేశారు. దీంతో మరికొంత డబ్బు చెల్లించారు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం వస్తుందని చెప్పారు. ఇది సదరు మహిళ నమ్మరు. దీంతో ఆమె దశల వారీగా
రూ.2.7 కోట్లు పెట్టుబడి పెట్టారు.

ఆ తర్వాత ఆమె సైబర్ కేటుగాళ్లను సంప్రదించారు. కానీ వారు స్పందించలేదు. దీంతో మోసపోయనని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి రూ.1.7 కోట్లు బాధితురాలికి తిరిగి వచ్చేలా చేశారు. మరో రూ.30 లక్షల వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ పడొద్దని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+