Hyderabad: మూసారాంబాగ్ వద్ద మూసీలో మహిళ మృతదేహం..
భారీ వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవాహిస్తోంది. హైదరాబాద్ లోని మాసారాంబాగ్ బ్రిడ్జి వద్ద నీరు పై నుంచి ప్రవహిస్తోంది. అయితే నదిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. చెత్తతో నీరు నిలిచిపోవడంతో జేసీబీ సాయంతో చెత్తను తొలగించారు. చెత్తను తొలగిస్తున్న సమయంలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కవాడిగూడకు చెందిన లక్ష్మిగా అనుమానిస్తున్నారు. మొన్న మూసీలో లక్ష్మి గల్లంతయింది.
కనిపించిన మృతదేహం మహిళదే కావడంతో ఆ డెడ్ బాడీ కావరడంతో లక్ష్మి మృతదేహంగానే భావిస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే లక్ష్మి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు మూసారాంబాగ్ బ్రిడ్జి పై నీరు ప్రవహిస్తోంది. గతంలో చాలా సార్లు బ్రిడ్జి పై నుంచి నీరు వెళ్లింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రమాదంలో పడింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 5న మూసారాంబాగ్ బ్రిడ్జి పైను రాకపోకలు నిలిపి వేశారు. అంబర్ పేట, దిల్ సుఖ్ నగర్ దారిలో రాకపోకలు నిలిచి పోయాయి.

పై నుంచి వరద రాక కొనసాగుతోంది. పై ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని కింది వదులుతున్నారు. దీంతో మూసీలో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి 4,120 క్యూసెక్కులు మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తి 2028 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రిజర్వాయర్లలోకి వరద పెరిగే అవకాశం ఉంది.
అటు లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. డ్రైనేజీ నీళ్లతో అండర్ పాస్ నిండిపోయింది. దీంతో రకపోకలు స్తంభించాయి. వాహనదారులు, చుట్టు ప్రక్కల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నుంచి ఇటు రావాలన్నా..ఇటు నుంచి అటు వెళ్లాలన్నా అవస్థలు పడుతున్నారు. నిన్న ప్రగతినగర్ ఓ బాలుడు మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి మృతి చెందాడు.












Click it and Unblock the Notifications