మళ్లీ భగ్గుమన్న HCU:ఏబీవీపీ-ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ,పలువురికి గాయాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగడంతో పలువురు గాయపడ్డారు
హైదరాబాద్: గత కొంత కాలంగా చాలా సైలెంట్‌గా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మళ్లీ ఉలిక్కిపడింది. విద్యార్థుల మధ్య దాడులు ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎఫ్ఐ (SFI) ఏబీవీపీ (ABVP) వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది.ఈ గొడవలో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏబీవీపీ వర్గంలో ఉన్న గిరిజన విద్యార్థులపై ఎస్‌ఎఫ్ఐ వర్గానికి చెందిన పలువురు విద్యార్థులు దాడికి దిగారని ఏబీవీపీ వర్గం ఆరోపించింది. వారిపై కత్తులతో దాడి చేశారని మండిపడింది.
SFI has unleashed violence against the tribal students and karyakartas of ABVP HCU. They have used sharp objects like knife. We condemn this attack against our karyakartas. @ABVPVoice @ABVPTelangana pic.twitter.com/DcKfgTdZ6O
— ABVP HCU (@abvpuoh) February 24, 2023
ఇదిలా ఉంటే విద్యార్థి ఎన్నికల్లో ఏబీవీపీ వర్గం ఓటమిపాలవుతుందని ముందే తెలిసి జీర్ణించుకోలేకపోయారంటూ ఎస్‌ఎఫ్ఐ వర్గం చెబుతోంది.ఈ క్రమంలోనే వారి ఫ్రస్టేషన్ ఈ రకంగా బయటపెడుతున్నారని వాపోయింది. ఏబీవీపీ విద్యార్థులే ముందుగా ఎస్‌ఎఫ్ఐని ఇతర విద్యార్థులను రెచ్చగొట్టారంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వివరించారు. మెన్స్ హాస్టల్‌లోకి వచ్చి ఏబీవీపీకి చెందిన విద్యార్థులు దాడులు చేశారంటూ ఈ దాడులను తాము ఖండిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఎస్ఎఫ్ఐ హెచ్‌సీయూ యూనిట్ ట్వీట్ చేసింది. మద్యం సేవించి వచ్చిన ఏబీవీపీ నాయకులు, ఎస్‌ఎఫ్ఐకి చెందిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అంతేకాదు పరుషపదజాలం కూడా ప్రయోగించారంటూ వెల్లడించింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ..SFI ,AVBP విద్యార్థుల పరస్పర దాడులు..పలువురికి గాయాలు..!!#HCU #HyderabadCentralUniversity #SFI #ABVP #Oneindiatelugu pic.twitter.com/ubv74efXRV
— oneindiatelugu (@oneindiatelugu) February 25, 2023
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications