Samantha:మళ్లీ పేరు మార్పు.. ఈ సారి ఇలా, పాత పేరేగా..?
ఇప్పుడు ఎక్కడ చూసినా.. సమంత- నాగ చైతన్య గురించే డిస్కషన్.. వారిద్దరూ విడిపోతున్నారు గా.. అంటూ ఒక్కటే చర్చ... ఇదిలా ఉండగా సామ్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదే తన పేరును మార్చేసుకున్నారు. ట్విట్టర్ బయోను మరోసారి మార్చారు. చైతుతో విడిపోతున్నానని నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో ఆమె పోస్ట్ చేయగా.. వెంటనే చై కూడా రియాక్టయ్యారు. ఔను తామిద్దరం విడిపోతున్నామని కామెంట్ చేశారు. అయితే సమంత తన పేరును మరోసారి మార్చుకుంది. ఇటీవల వరసగా నేమ్ ఛేంజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

మళ్లీ పేరు మార్పు
సమంతా మరోసారి తన పేరు మార్చుకుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. ఆ మధ్య సమంతా ఓ బేబీ సినిమా సమయంలో బేబీ అక్కినేనిగా తన సోషల్ మీడియా ఖాతాను మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే చైతూతో విడాకుల రూమర్స్ బయటకి వచ్చిన కొత్తలో కొన్ని ఖాతాల్లో పూర్తిగా తన పేరు తొలగించి ఓన్లీ ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ప్రొఫైల్ నేమ్‌గా పెట్టుకుంది. మరికొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో జస్ట్ సమంత అనే పదాన్ని మాత్రమే ఉంచింది.

సమంతగా
ఇప్పుడు మరోసారి నేమ్ ఛేంజ్ చేసింది. నిన్నటి వరకు ఉన్న ఎస్ అనే అక్షరాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మార్చింది. సమంత అని పేరును మార్చింది. శనివారం అధికారికంగా చైతన్యతో విడాకుల అంశాన్ని ధృవీకరించిన సామ్.. ఆదివారం ఇలా పేరు మార్చేయడం కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారుతుంది. నిజానికి చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. తర్వాత సమంత అక్కినేని, డైవర్స్ రూమర్స్ సమయంలో ఎస్, ఇప్పుడు మళ్ళీ సమంతకి ఫిక్స్ అయ్యారు.

వద్దు విడిపోవద్దు...? కానీ
చై- సామ్ విడిపోకూడదని అంతా అనుకున్నారు. వారి ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సంసారంలో సరిగమలు సహజం అంటూ ఇటీవల సెన్సేషనల్ స్టార్ శ్రీ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. చిన్న చిన్న గొడవలు వస్తాయని, వాటన్నింటిని పరిష్కరించుకుని, కొన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉండాలని సజెస్ట్ చేసింది. నాగ చైతన్య అన్నయ్య , సమంత వదిన ఇద్దరు కూడా సంసారాన్ని చక్క బెట్టుకునేందుకు ఒకరు కాస్త తగ్గాలని విజ్ఞప్తి చేసింది.
ఇద్దరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు దక్కించుకున్నారని గుర్తుచేశారు. విడిపోతే చాలా మంది బాధ పడుతారని పేర్కొన్నారు. సమంత వదిన సంసారాన్ని చక్క బెట్టుకొ అని కోరింది శ్రీ రెడ్డి. కావాలంటే మోడలింగ్.. సినిమాలు ఏమైనా ఒక హద్దు వరకు చేసుకోవాలని సూచించింది. అయినా వారిద్దరూ విడిపోయారు.
Recommended Video

వద్దనడంతోనే.. ఇలా
వాస్తవానికి చై.. సినిమా, మోడలింగ్‌పై ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. పెళ్లికి ముందు కూడా సినిమాల్లో నటించాలనే అభిప్రాయ పడ్డారు. తమకు బ్యాక్ గ్రౌండ్ ఉందని.. వారు ఈ స్టేజీకి రావడానికి చాలా కష్టపడ్డారని ఆ సమయంలో చెప్పారు. మరీ పెళ్లయిన.. ఇన్నాళ్లకు చై.. మనసు మారిందా.. సినిమాలు వద్దు అని అంటున్నారా అనే అంశం చర్చకు వచ్చింది. కానీ ఇదే నిజం అని దాదాపుగా తేలిపోయింది. సో శ్రీ రెడ్డి అంచనా నిజమేనన్న మాట..
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications