శ్రీరెడ్డికి పెళ్లా..? ట్వీట్ వదిలిన ఫైర్ బ్రాండ్.. గుడ్ న్యూస్ అనడంతో రచ్చ..
శ్రీరెడ్డి.. ఆమె ఏం చేసినా సంచలనమే. క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతెత్తిన శ్రీరె్డ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆచార్య టీజర్ గురించి కామెంట్స్ రచ్చకు దారితీశాయి. తర్వాత మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె చేసిన ట్వీట్ పలు సందేహాలకు దారితీస్తోంది. త్వరలో గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆ తీపి కబురు ఏంటబ్బా అని.. నెటిజన్లు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. తన పర్సనలా..? లేక మరెవరినైనా కెలుకుతారా అనే చర్చ జరుగుతోంది.

అర్ధనగ్న ప్రదర్శన నుంచి..
ఫిల్మ్ నగర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డికి హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమె చెన్నైలో ఉంటున్నారు. ఇటీవల ప్యాంట్ విప్పేసి నానా హంగామా చేశారు. ఏ స్టార్‌ని వదలకుండా కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అతీతులు కారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఇటీవల అనుకూలంగా కామెంట్స్ చేశారు. అయితే గుడ్ న్యూస్ అని చెప్పిందీ ఏమయి ఉంటుంది అబ్బా అనే అంశం చర్చకు దారితీసింది.

ప్యాంట్ విప్పేసి
శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందా అనే అనుమానం కలుగుతోంది. అందుకే గుడ్ న్యూస్ అనే పోస్ట్ చేశారని కొందరు అంటున్నారు. శృంగార తార స్వాతినాయుడు కూడా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారికి పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా మనువాడనుందా..? అందుకే గుడ్ న్యూస్ పేరుతో పోస్ట్ చేశారా అని కొందరు అంటున్నారు. మరొకరు మాత్రం అదేం లేదు అని చెబుతున్నారు. లేదంటే వెంటనే ఫోటో షేర్ చేసేవారు కదా అని సమర్థించుకుంటున్నారు.
Recommended Video
శ్రీరెడ్డికి పెళ్లా..?
సినిమాల్లో అవకాశాల కోసం నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డికి.. మంచి సినిమా అవకాశం వచ్చి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. అందుకే ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారని తెలిపారు. కానీ దీనిని ధృవీకరించాల్సింది మాత్రం శ్రీరెడ్డి మాత్రమే.. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్పటివరకు ఆ ట్వీట్ రూమర్ రకరకాల కథనాలతో జనాల్లోకి వెళుతోంది. ప్రస్తుతానికైతే పెళ్లి/ సినిమా అవకాశం అని చర్చ మాత్రం జరుగుతుంది.












Click it and Unblock the Notifications