ప్రైవేటు బలిపీఠంపై బీహెచ్ఈఎల్: నెక్స్ట్ రౌండ్‌ అదే?: కేటీఆర్ డౌట్స్ నిజమే: సలహాదారు నియామకం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రత్యేకించి- విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి వంద శాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోబోతోన్నామంటూ చేసిన ప్రకటన అనంతరం.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం సరికాదంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం వ్యాఖ్యానించారు.

 వెనక్కి తగ్గని కేంద్రం..

వెనక్కి తగ్గని కేంద్రం..

అవెలా ఉన్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేయనుంది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఆరంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచి వేగం పుంజుకోనుంది. ఏకంగా వంద ప్రభుత్వరంగ సంస్థల జాబితాను కేంద్రం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వంటి టాప్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

బీహెచ్ఈఎల్ సహా

బీహెచ్ఈఎల్ సహా

బీఈఎంఎల్‌ సహా మెకాన్‌ లిమిటెడ్‌, ఆండ్రూ యూల్‌ అండ్‌ కో లిమిటెడ్‌లోనూ వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. దీనిపై నెలరోజుల కిందటే కొన్ని బిజినెస్ న్యూస్ పోర్టల్స్ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మలి విడత పెట్టుబడుల ఉపసంహరణ, విక్రయాల జాబితాలో ఈ మూడు కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. బీహెచ్ఈఎల్‌లో ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు ఆ కథనాలు స్పష్టం చేశాయి. దీనికోసం ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ను సలహాదారుగా కూడా నియమించుకున్నట్లు తెలిపాయి.

300 నుంచి 24కు

300 నుంచి 24కు

కేంద్రం ఆధీనంలో ప్రస్తుతానికి 300 ప్రభుత్వరంగ కంపెనీలు ఉన్నాయి. ఆ సంఖ్యను 24కు కుదించుకోవాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. నీతి ఆయోగ్‌ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంతం చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిందటి నెల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. డిజిన్వెస్టమెంట్‌ పాలసీ ఎలా ఉండబోతోందనే విషయాన్ని వెల్లడించారు.

రూ.1.75 లక్షల కోట్లు..

రూ.1.75 లక్షల కోట్లు..


వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయించడం ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బిజినెస్ వెబ్‌సైట్స్ స్పష్టం చేశాయి. కాగా- బీహెచ్ఈఎల్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయించవచ్చంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామంటూ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీహెచ్ఈఎల్‌ను కూడా అమ్మకానికి కేంద్రం సిద్ధపడొచ్చని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+