మళ్లీ ఛార్జీల మోత.. డీజిల్ సెస్సు పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు

తెలంగాణ‌ రాష్ట్రంలో మ‌రోసారి ఆర్టీసీ చార్జీల మోత మోగింది. ఇప్ప‌టికే రెండుసార్లు చార్జీల‌ను పెంచిన ఆర్టీసీ వ‌రస‌గా మూడో సారి చార్జీల‌ను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో చార్జీల‌ను పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యం శ‌నివారం నుంచే అమ‌ల్లోకి రానుంది. డీజిల్ సెస్ పేరుతో పెంచిన చార్జీలు ఆయా బ‌స్సుల్లో రెండు కేట‌గిరీలుగా అమ‌లు కానున్నాయి. పల్లె వెలుగు, ఆర్డిన‌రీ, సిటీ ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో రూ.2 పెర‌గ‌నున్నాయి. ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, మెట్రో డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో ఏకంగా రూ.5 పెర‌గ‌నుంది. ఏ బ‌స్సులోనైనా ఇక‌పై క‌నీస టికెట్ ధ‌ర‌ను రూ.10కు పెంచుతూ కూడా ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంది.

ఇంతకుముందు కూడా సాధారణ చార్జీల పెంపు కాకుండా సేప్టీ రూపంలో పెంచారు. ప్రమాదాలు, వాహనాల బీమా, విపత్తులు తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూల నిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు అధికారులు వెల్లడించారు.

again rtc charges hike in the telangana state

ఆర్టీసీలో పలు మార్పులను తీసుకు వచ్చారు ఎండీ సజ్జనార్. కానీ ఈ ఛార్జీల మోత ఏంటో అర్థం కావడం లేదు. సమస్యలను పరిష్కరిస్తున్నారు.. కానీ ట్రావెల్ ఛార్జీ మాత్రం అలానే ఉంటున్నాయి. ఇదీ తీవ్రమైన సమస్య.. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తన మార్క్ పనులను సజ్జనార్ కంటిన్యూ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ప్రోత్సహిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలని ప్రజలను కోరారు. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన ఆర్టీసీలో ప్రయాణికులను చేరవేయడం సామాజిక భాద్యతగా స్వీకరించామని వివరించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారికి నిన్న ఆఫర్ ప్ర‌క‌టించారు.

బ‌స్సుల్లో ప్ర‌యాణించిన సంద‌ర్భంగా మీకు ఎదురైన అనుభ‌వాల‌ను చెప్పాల‌ని కోరారు. అలాంటి వారికి రివార్డులు ఇస్తామంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్ర‌కారం.. టీఎస్సార్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసిన వారు పంపే అనుభ‌వాల్లో నుంచి గుండెల‌కు హ‌త్తుకునేలా ఉన్న అనుభ‌వాలు పంపిన వారికి టీఎస్సార్టీసీ త‌ర‌ఫున రివార్డులు ప్ర‌క‌టిస్తార‌ు. ఇంతవరకు బానే ఉన్నా.. ఛార్జీల మోత ఏంటీ అని జనం అడుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+