హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజపక్సేపై మోడీ ఒత్తిడి..? అదానీకి మేలు, అందుకే తెరపైకి అగ్నిపథ్: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

అగ్నిపథ్ పథకంపై నిరసన జ్వాలలు కొనసాగాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం ప్రవేశపెట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కీలకమైన సమస్య పక్కదారి పట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేశారా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

అందుకే ఇలా...


శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై ఆరోపణలు వస్తోన్నాయి. దాంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని కేటీఆర్ కొశ్చన్ చేశారు. కీలక అంశాలను చర్చకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు ఇలా చేస్తుంటాయనే అపవాదు ఉంది. దానిని మంత్రి కేటీఆర్ గుర్తుచేసి.. ఆరోపణలు చేశారు.

మోడీ ఒత్తిడి..?

మోడీ ఒత్తిడి..?

శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై ప్రధాని మోడీ ఒత్తిడి తెర్చారట. ఈ మేరకు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఫెర్డినాండో తన కామెంట్లను వెనక్కి తీసుకొన్నారు. అంతేకాదు పదవీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్‌లో విపక్షాలు ప్రధాని మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.

నోరు మెదపరా..?

నోరు మెదపరా..?


ఈ అంశంపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు. వారి ప్రమేయం వల్లే ఇలా జరిగిందా అని అడిగారు. సమస్యను పక్కదారి పట్టించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. మరీ ఈ కామెంట్స్‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలీ.

వాట్సాప్ గ్రూపులలో సందేశం

వాట్సాప్ గ్రూపులలో సందేశం

అగ్నిపథ్ పథకం అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కూడా చేసింది. విద్యార్థులు రోడ్డెక్కడానికి కారణం సోషల్ మీడియా అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ గ్రూపులపై నిషేధం విధించింది.అగ్నిపథ్ పథకం గురించి వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందజేశారు. అలా 35 గ్రూపులను కేంద్రం గుర్తించింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని పేర్కొంది. దాంతోనే హింసకు దారితీసిందని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరాతీసింది.

English summary
agnipath scheme announce behind this reason minister ktr alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X