Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పెరుగుతున్న గాలి కాలుష్యం.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో..

హైదరాబాద్‌(Hyderabad)లో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. గాలి నాణ్యత తగ్గుతుండడంతో ఆందోళన నెలకొంది. వాహనాలు, పరిశ్రమలతో గాలి కాలుష్యం పెరుగుతోంది. గత నెలలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ముఖ్యంగా జూ పార్క్ ప్రాంతంలో గాలి నాణ్యత తగ్గింది. జూ పార్క్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భారీ ట్రాఫిక్ రద్దీ గాలి నాణ్యత క్షీణతకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

బంజారా హిల్స్ ప్రాంతంలో అత్యుత్తమ గాలి నాణ్యత ఉంది. ప్రాంతాల వారీగా AQI స్థాయిలు చూసినట్లయితే.. జూ పార్క్ వద్ద 162, సెంట్రల్ యూనివర్సిటీ 99, కోకాపేట్ 89, కొత్త మలక్‌పేట 81, సైదాబాద్ 71, మణికొండ 63, మాదాపూర్ 61, KPHB దశ III 58, విట్టల్ రావు నగర్ 57, పుప్పల్‌గూడ 56, కోటి 48, షిర్డీ సాయి నగర్ 47, బంజారా హిల్స్ 28 స్థాయిలో ఉంది.

Air Pollution Are Increasing Hyderabad, Particularly Zoo Park Area

AQI అంటే ఏమిటి?
AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో గాలి నాణ్యతను కొలవడం. AQI 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు.. 50కి పైన ఉంటే గాలి నాణ్యత బాగాలేనట్లు.. ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి ప్రతిరోజూ సుమారు 14,000 లీటర్ల గాలిని పీల్చుతాడు. పీల్చేగాలిలో కలుషితాలు ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. హైదరాబాద్‌లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, వాహనాల ఉద్గారాలను తగ్గించడం మరియు క్లీనర్ వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+