Allu Arjun: హైదరాబాదులో స్టయిలిష్ స్టార్ థియేటర్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ గురూ..!
హైదరాబాదులోని అమీర్‌పేట్‌లో ఉన్న అల్లు అర్జున్ థియేటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.దీని స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకోండి
హైదరాబాద్ : హైదరాబాదులో అమీర్‌పేట్ అంటే తెలియనివారుండరు. ఈ ఏరియా చాలా ఫేమస్.దేశనలుమూలల నుంచి యువత ఇక్కడ సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునేందుకు వాలిపోతుంది. ఇక ఈ ఏరియాలో ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు కూడా హద్దులేదు. ఎప్పుడూ అమీర్‌పేట్ ప్రాంతం జనాలతో కిటకిటలాడుతుంది. ఇక సిటీకి ఇప్పుడు ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ ఏరియాలో టిఫిన్స్ నుంచి హాస్టల్స్ వరకు అన్నీ కాస్లీ అనే చెప్పొచ్చు. ఇక సాయంత్రం వేళ ఇక్కడ షాపింగ్ చేసేందుకు మహిళలు వాలిపోతారు. వారికి దొరకని ఐటెం అంటూ ఉండదు. అమీర్‌పేట్‌లో మరో ల్యాండ్‌మార్క్ సత్యం థియేటర్. ఇది ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. దీని స్థానంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన థియేటర్ రెడీ అవుతోంది. ఈ థియేటర్‌లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి.

అమీర్‌పేట్‌లో అల్లు థియేటర్
అమీర్‌పేట్‌లో సత్యం థియేటర్ అంటే తెలియనివారుండరు. ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమాతో యువతను ఈ థియేటర్ అలరించేది. అయితే కాలక్రమంలో అన్నీ మారిపోయాయి. కొత్త టెక్నాలజీ రావడంతో సినిమా థియేటర్ల రూపు రేఖలు మారిపోయాయి, మారిపోతున్నాయి. ఇక నగరంలో ఎటు చూసినా మల్టీప్లెక్స్‌లు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు అమీర్‌పేట వాసులను అలరించిన సత్యం థియేటర్ ఇప్పుడు లేదు. దీని స్థానంలో కొత్తగా ఏషియన్ సినిమాస్ వచ్చింది. ఇది స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా కట్టించుకుంటున్న థియేటర్. దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ బన్నీ టేస్ట్ మేరకే జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ థియేటర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
బన్నీ థియేటర్‌లో స్పెషల్ ఫీచర్లు
ఇక బన్నీకి చెందిన ఈ కొత్త థియేటర్‌లో ఎన్నో హంగులు మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. AAA సినిమాస్‌గా పిలవబడుతున్న ఈ బాహుబలి థియేటర్‌లో పూర్తిస్థాయి ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ భారతంలో ఇలాంటి ఫీచర్లున్న థియేటర్ ఒకటే ఉండగా ఆ తర్వాత అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్ కావడం విశేషం.ఇక హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్ ఉన్న ఏకైక థియేటర్ ఇదే అవుతుంది. ఈ థియేటర్‌లో అడుగుపెట్టే వారికి కచ్చితంగా కొత్త అనుభూతికి గురవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
స్పెషల్ అట్రాక్షన్‌గా బన్నీ ప్రతిమ
ఇక పాత స్క్రీన్‌లపై సినిమా చూసే కాలానికి గుడ్‌బై చెప్పేసి అధునాతన టెక్నాలజీతో రూపొందుకున్న కొత్త ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై సినిమా చూస్తే కొత్త అనుభూతిని పొందుతారు.ఈ కొత్త ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా చూస్తే కొత్త ప్రపంచంలో విహరించినంత అనుభూతి కలుగుతుంది. స్టన్నింగ్ విజువల్స్, హైకాంట్రాస్ట్ కలర్స్ సినిమా చూసేందుకు వచ్చేవారిని కట్టిపడేస్తుంది.ఇక్కడ బన్నీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ ఉంది. ఈ థియేటర్‌లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రతిమ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.
త్వరలోనే ఓపెన్ కానున్న స్టయిలిష్ స్టార్‌కు చెందిన స్టయిలిష్ థియేటర్‌లో పాప్‌కార్న్‌తో సినిమా చూసేందుకు రెడీగా ఉండండి. ఈ మ్యాజిక్‌ను మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి.












Click it and Unblock the Notifications