Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Allu Arjun: హైదరాబాదులో బన్నీ ప్రైమ్ బిజినెస్ ఏరియాస్ ఇవే..!

Allu Arjun:అల్లు అర్జున్... ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న స్టయిలిష్ స్టార్ అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. ఈ మధ్యే అమీర్‌పేట్‌లో AAA సినిమాస్ ప్రారంభం సందర్భంగా బన్నీ సందడి చేశారు. అల్లు వారి అబ్బాయిని చూసేందుకు ఫ్యాన్స్ మామూలుగా అక్కడికి చేరుకోలేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఆ అమీర్‌పేట్ గల్లీలు నిండిపోయాయి.

ఇక ఇప్పటి వరకు అల్లు చేసిన సినిమాల గురించే చర్చించుకుంటున్నాం. కానీ తన బిజినెస్ గురించి లేదా వ్యాపార సామ్రాజ్యం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా... ఒక వేళ మాట్లాడుకుంటే గీతా ఆర్ట్స్ గురించి చెప్పుకుని ఉంటాం. అయితే మెగా అల్లుడికి హైదరాబాదులో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలుసా.. మరెందుకు ఆలస్యం ఒకసారి భాగ్యనగరంలో బన్నీ బిజినెస్‌లపై ఓ లుక్కేద్దాం పదండి.

అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు చాలామందికి ఒక సినిమా హీరో అని మాత్రమే తెలుసు. కానీ ఆయన సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కూడా చాలా తక్కువమందికే తెలుసు. బన్నీ తెరవెనుక ఉండి చేసిన బిజినెస్‌లు అవి సక్సెస్ అయిన తీరే చెబుతాయి స్టయిలిష్ స్టార్ ఒక బిజినెస్ ఐకాన్ అని. పలు రంగాల్లో అల్లు అర్జున్ వ్యాపారం ప్రారంభించారు. ఎంటర్‌టెయిన్మెంట్ రంగం నుంచి బెవెరెజెస్ వరకు అల్లు వారి మార్క్ కనిపిస్తుంది.

బఫెలో వైల్డ్ వింగ్స్ : బఫెలో వైల్డ్ వింగ్స్ అనేది అమెరికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్. ఇది హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో ఉంది. ఇది స్పోర్ట్స్ లవర్స్‌ మరియు ఫుడ్ లవర్స్‌ను భలేగా అట్రాక్ట్ చేస్తుంది. బన్నీఈ ఫ్రాంఛైజీని తీసుకుని బాగానే సక్సెస్ అయ్యారు.

Allu Arjun

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం: అల్లు అర్జున్ ఆహాకు అనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు సహవ్యవస్థాపకులు. ఈ ఓటీటీపై తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌లు స్ట్రీమ్ అవుతాయి. ఇక ఆహా హెడ్‌క్వార్టర్స్ హైదరాబాదులోని ఫిలింనగర్‌లో ఉంది. ఆహా ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే జనాల్లోకి దూసుకెళ్లింది. ది మోస్ట్ హ్యాపెనింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందింది ఆహా.

Allu Arjun

అల్లు స్టూడియోస్: అల్లు అర్జున్ సొంత ఫిలిం ప్రొడక్షన్ ఫెసిలిటీ అల్లు స్టూడియోస్. ఇక్కడ సినిమాకు సాంకేతికపరంగా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ రోడ్ నెం 10లో ఈ సంస్థ ఉంది. ఇందులో ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి షూటింగ్ ఫ్లోర్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఆడియో రికార్డింగ్ స్టూడియోలు ఉన్నాయి.

Allu Arjun

AAA సినిమాస్ : అల్లు అర్జున్ తాజాగా AAA సినిమాస్‌ను అమీర్‌పేట్‌లో ప్రారంభించారు. ఇది అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన మల్టీప్లెక్స్. ఇందులో ఎంటర్‌టెయిన్మెంట్‌కు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. రీసెంట్‌గా ఓపెన్ అయిన ఈ మల్టీప్లెక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో యాంబియెన్స్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

Allu Arjun

గీతా ఆర్ట్స్ : తెలుగు సినిమా గురించి తెలిసిన వారికి కచ్చితంగా గీతా ఆర్ట్స్ తెలిసే ఉంటుంది. అంతలా ఇది పాపులర్ అయ్యింది. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఈ గీతా ఆర్ట్స్ సంస్థకు ఓనర్ కూడా అల్లు అర్జునే. జూబ్లీ హిల్స్‌లాంటి ప్రైమ్ ఏరియాలో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ బిజినెస్ ఎక్కువగా ఎంటర్‌టెయిన్మెంట్ రంగంలో ఉండటంతో ఆయనకు సినిమా పై ఉన్న ప్యాశన్ ఎలాంటిదో ఇట్టే అర్థమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+