Hyderabad: ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు ఐదు రోజుల పాటు పనిని రౌండ్-ది-క్లాక్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇది ZPHS U-టర్న్ నుంచి గచ్చిబౌలి వైపు మార్గంలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రయాణికులు కొత్తగూడ-రోలింగ్ హిల్స్ మధ్య గచ్చిబౌలి జంక్షన్ వరకు వెళ్లకుండా ఉండాలన్నారు.

జేడ్పీ హైస్కూల్, గచ్చిబౌలి జంక్షన్ మధ్య రహదారి వెడల్పు 3 మీటర్లు తగ్గుతుంది. ఇది ట్రాఫిక్ రద్దీకి దారి తీస్తుంది. సాధారణ ప్రజలు మళ్లింపులను గమనించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు. అటు అంబర్ పేటలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి. అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున అంబర్‌పేట-గోల్నాక మధ్య వెళ్లే వాహనాలపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

AmberPeta Shilpa Layout Phase-2 Police imposed traffic restrictions in Hyderabad

ఫ్లై ఓవరు పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. 6 నంబర్ జంక్షన్ నుంచి గోల్నాకకు వెళ్లే వాహనాలు జిందా తిలిస్మత్‌కు రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. గోల్నాక నుంచి 6వ నంబర్ జంక్షన్ వరకు ఆంక్షలు లేకుండా ట్రాఫిక్ యధావిధిగా కొనసాతోంది. ఎన్‌సిసి గేట్ నుంచి 6 నంబర్ జంక్షన్‌కు వచ్చే ఆర్‌టిసి బస్సులను తిలక్ నగర్ ఎక్స్ రోడ్‌లో ఫీవర్ ఆసుపత్రి వైపు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నందున ప్రజలు సహకరించాలని కోరారు.

అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గత నెలలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పనులు వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+