హైదరాబాద్ లో అమిత్ షా : నాడు భాగ్యలక్ష్మీ - నేడు ఉజ్జయినీ : మునుగోడు బరిలోకి..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన పైన ఆసక్తి నెలకొని ఉంది. అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, లక్షణ్ స్వాగతం పలికారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా విమనాశ్రయం నుంచి ఉజ్జయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి..ఆశీర్వాదం తీసుకున్నారు.

ఉజ్జయిని అమ్మవారి దేవాలయంలో
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో అమిత్ షా నాడు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కోసం తొలి సారిగా నియోజకవర్గానికి వెళ్తున్న అమిత్ షా.. ఉజ్జయిన అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల సమయం నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రస్తావన తీసుకొస్తున్నారు. దేవాలయం నుంచి బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి చేరుకున్న అమిత్ షా..అక్కడ ఆల్పాహారం తీసుకున్నారు.

మునుగోడు సభలో ఏం చెబుతారు
ఆ తరువాత తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ రైతు సంఘాల నేతలతో మాట్లాడారు. వారితో రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇది ముగించుకొని మునుగోడు చేరుకున్న తరువాత.. బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇప్పటికే అక్కడ పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసారు. మునుగోడు బహిరంగ సభా వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీ లోకి ఇదే సభ నుంచి చేరికలు ఉంటాయని చెప్పినా.. కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఈ రోజు పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

పార్టీ నేతలకు రోడ్ మ్యాప్
అయితే, బహిరంగ సభ తరువాత అమిత్ షా రోడ్డు మార్గం లో రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్తారు. అక్కడ నుంచి నోవాటెల్ చేరుకొని పార్టీ నేతలతో సమావేశమవుతారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా పార్టీలో చేరికలు..భవిష్యత్ కార్యాచరణ పైన రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు. అదే సమయంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తోనూ అమిత్ షా సమావేశం కానున్నారు. జూనియర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా.. నేరుగా తారక్ ను కలిసి అభినందించాలని నిర్ణయించారు. ఇక, ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ పాత్ర పైన అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications