ప్రణయ్‌కు కొడుకు పుట్టాడు: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత
హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది ప్రణయ్ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రణయ్ సతీమణి అమృత అప్పటికే గర్భవతి. ఇప్పుడు ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అమృత, ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అమృత ఐదు నెలల గర్బిణీ.

మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత
ఇప్పుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రణయ్ సంతోషం కనిపించింది. చనిపోయిన ప్రణయ్ పిల్లాడి రూపంలో జన్మించాడని వారు సంబరపడుతున్నారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత మాట్లాడుతూ.. తాను తన బిడ్డ కోసం బతుకుతానని చెప్పింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
అమృత, ప్రణయ్‌లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు, ఆమె బాబాయి, మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై విచారణ సాగుతోంది. మరోవైపు, ప్రణయ్ హత్య తర్వాత అమృత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తింటి వారి వద్దే అమృత
ప్రణయ్ హత్య అనంతరం అమృత అత్తింటి వారి వద్దే ఉంటోంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. తన భర్త ప్రణయ్‌ను హత్య చేసిన తన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత ఆమె పట్ల సానుభూతి కనిపించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications