Hyderabad: జూబ్లీహిల్స్‌లో విషాదం.. గోడ కూలి 8 నెలల చిన్నారి మృతి..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందిన మృతి చెందింది. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన శ్రీకాంత్, జగదేవి దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి రహమత్‌గనర్‌లోని ఓంనగర్‌లో ఓ రేకుల గదిలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 8 నెలల కూతరు జీవనిక ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రేకుల షెడ్డూ పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం రేలింగ్ కూలి.. రేకుల షెడ్డూ పడ్డాయి.
రేకులు పగిలి రాళ్లు వారి పడడంతో జీవనిక అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీకాంత్, జగదేవికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యానికి కారణమైన సమీపంలోని భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు నిరసనకు దిగారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది.

అల్వాల్, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఈసీఐఎల్, ఏఎస్‌రావు నగర్, కాప్రా, కూకట్‌పల్లి, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం రావడంతో పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బోరబండ ఎన్ఆర్ఆర్ పురలో సాయంత్ర 6 తర్వాత పోయిన విద్యుత్ బుధవారం ఉదయం 9 గంటలకు వచ్చింది.
రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పండి. అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్ మెట్, దోమలగూడ, కవాడిగూడ, గాంధీ నగర్, అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్ లో కూడా వాన పడింది. సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. విపరీతమైన ఈదురుగాలులు వీయడంతో జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేసింది.












Click it and Unblock the Notifications