Hyderabad: కూకట్ పల్లిలో ఏం జరుగుతోంది.. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు..!

కొద్ది రోజుల క్రితం కూకట్ పల్లిలోని ఓ అపార్ట్ మెంట్ దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహం కనిపించింది. మొదటగా సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావించారు. అయితే పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. ఆ మహిళను మరో మహిళ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితురాలు ప్రియాంకను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం కూకట్ పల్లిలోని భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ ఉంటుంది. ఈమె వ్యభిచారమే వృత్తిగా జీవిస్తోంది. అలాగే ఎల్లమ్మబండాలోని ఎన్టీఆర్ నగర్ లో మంజుల అనే మహిళ నివసిస్తోంది. ఈమె కూడా వ్యభిచారం చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో మంజుల, ప్రియాంకకు పరిచయం ఏర్పడింది. ప్రియాంక తను ఉంటున్న ఇంటి వద్ద భద్రత లేదని.. తన చెవి కమ్మలు, పలు వెండి ఆభరణాలను మంజులకు ఇచ్చి దాచమని చెప్పింది. దీంతో మంజుల వాటిని తీసుకెళ్లింది.

An incident that took place in KukatPally is creating a stir locally

కొద్ది రోజుల తర్వాత ప్రియాంక తన చెవి కమ్మలు, వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే మంజుల వాటిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరికి ప్రియాంక స్థానికంగా ఉన్నవారితో మంజులను బెదిరించింది. దీంతో మంజుల ఆభరణాలు తిరిగి ప్రియాంకకు ఇచ్చేసింది. ప్రియాంకపై పగ పెంచుకున్న మంజుల మంచిగా ఉన్నట్లు యాక్టింగ్ చేసింది. ప్రియాంకకు మద్యం తాగించి లోధా అపార్ట్ మెంట్ ముందు ఉన్న ఉదాసీన్ మఠ వద్ద ఖాలీ స్థలంలోకి తీసుకెళ్లింది. మంజుల ప్రియాంక గొంతు కోసి హత్య చేసింది.

అత్యాచారం చేసి హత్య చేసినట్లు నమ్మించాలని.. ప్రియాంక బట్టలు చింపేసింది. మృతదేహాన్ని నగ్నంగా ఉంచి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మంజులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం ఆమ్రాబాద్ కు చెందిన ప్రియాంకకు పెళ్లయింది. ఆమె ఒక కూతురు కూడా ఉంది. అయితే భర్తతో విడిపోయి.. బిడ్డను వదిలి 2 నెలల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+