Indigo: రన్ వేపై నిలిచిపోయిన విమానంలో.. అందులో మంత్రి, ఎమ్మెల్యే..
హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 6707 సాంకేతిక లోపం కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో రన్‌వేపై నిలిచిపోయింది. దాదాపు గంటపాటు రన్‌వేపైనే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, అనుచరులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.
ఇటీవల, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) న్యూఢిల్లీలో జరిగిన ACREX హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డుల పోటీని గెలుచుకుంది.
ఎనర్జీ ఎఫిషియెన్సీ, సస్టైనబిలిటీ కోసం కమర్షియల్ బిల్డింగ్ కేటగిరీలో పోటీ పడుతున్న GHIAL భారతదేశపు అగ్రశ్రేణి కార్పొరేట్ కార్యాలయాలు, భవనాలను అధిగమించి విజేతగా నిలిచింది. హైదరాబాద్ విమానాశ్రయాన్ని భారతదేశంలోని ఇతర నగరాలతో కలుపుతూ 18 దేశీయ ఇండిగో విమానాలు ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి ముంబై, హైదరాబాద్ నుంచి గోవా,హైదరాబాద్ నుంచి కోల్‌కతా, హైదరాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి జైపూర్, హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి షిర్డీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్,
ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్, పూణె నుంచి హైదరాబాద్, మైసూర్ నుంచి హైదరాబాద్, కోల్‌కతా నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్, ఇండోర్ నుంచి హైదరాబాద్ విమానాలు ఉన్నాయి. అంతేకాకుండా, హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానించే అనేక ఇండిగో విమానాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications