అనసూయకు అరుదైన గౌరవం: పోస్టల్ స్టాంప్ ముద్రణ.. గర్వంగా ఉందంటూ..
యాంకర్ అనసూయకు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఫోటోతో ఏకంగా పోస్టల్ స్టాప్ ముద్రించారు. దీంతో ఆమె ఆనందానికి అవధి లేకుండా పోయింది. 'తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్' అనసూయను పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడిస్తూ పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేశారు. దీనిని సోషల్ మీడియా ద్వారా అనసూయ షేర్ చేశారు.
చిత్రపురి చలన చిత్రోత్సవం వారికి అనసూయ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో ఇంతకు మించి గౌరవం ఏది ఉండదని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. . సొంత పోస్టల్ స్టాంపులు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ అర్హత పొందేందుకు తనేం చేశానో తెలియదు అని.. కానీ దీనిపై మాత్రం గర్వపడుతున్నానని వివరించారు. తనను ప్రోత్సహించడానికి చేస్తున్న గొప్ప ప్రయత్నం అని చిత్రపురి చలన చిత్రోత్సవం చేశారని పేర్కొన్నారు. ఈ గొప్ప పనుల కోసం తనవంతుగా సహాయం చేస్తానని స్పష్టంచేశారు.

చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిని నింపే ఎంతో మంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను వెల్లడించనుంది. అంతగా ఏం సాధించానో తెలియదు అని అనసూయ అనడం నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. ఓ సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా అనసూయకు ఈ గౌరవం లభించడం సరైనదేనని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications