Anchor vishnu priya : ఇదేం నడుము రా బాబు...విష్ణు ప్రియ అందాలకు నెటిజన్లు ఫిదా
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది యాంకర్ విష్ణు ప్రియ. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో తన డ్యాన్స్ వీడియోను విష్ణు ప్రియ పోస్టు చేసింది.
'సమ్మోహునుడా' అంటూ సాగే పాటకు విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాటకు విష్ణు ప్రియ వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. వీడియోలో కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.ముఖ్యంగా ఈ పాటలో విష్ణు ప్రియ నడుమందాలకు ఎవరైనా బానిస అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక విష్ణు ప్రియ కెరీర్ విషయానికి వస్తే.. 'పోవే పోరా ' షో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న, ఈ అమ్మడు తరువాత పెద్దగా రాణించలేకపోయింది. అడపదడపా అక్కడక్కడ కనిపించడమే తప్ప.. కెరీర్‌కు ఉపయోగపడే..ఒక్క ఛాన్స్ కూడా విష్ణు ప్రియకు రాలేదనే చెప్పాలి. గతంలో 'జర్రీ జర్రీ' అనే ప్రైవైట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. అయినప్పటికీ కూడా విష్ణు ప్రియకు అటు షోల్లో కాని..ఇటు సినిమాల్లో కాని పెద్దగా అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. మరి ఈ వీడియోలో విష్ణు ప్రియ వేసిన స్టెప్పులు చూసైన అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications