10 లక్షల ఉద్యోగాలు.. సిటీ నలువైపులా ఐటీహబ్‌లే..

హైదరాబాద్ నలువైపులా ఐటీ హబ్‌లు విస్తరిస్తున్నాయి. మరో ఐటీ హబ్ రానుంది. దీని ఏర్పాటు కోసం రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఇదుళ్లనాగులపల్లి, కొల్లూరు ప్రాంతాల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని ఈ ఐటీ హబ్ కోసం హెచ్ఎండీఏ గుర్తించింది.

హైటెక్ సిటీ తరహాలోనే ఇక్కడ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భూసేకరణ చేస్తారు. సమీకరించే భూముల యజమానులకు ఎకరాకు 600 గజాల చెప్పున అభివృద్ది చేసిన ప్లాట్లను కేటాయిస్తారు. ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

another 10 lakh jobs created in hyderabad

హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఐటీ రంగానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అన్నీ భాగ్యనగరం బాట పట్టాయి. అన్ని హంగులతో కూడిన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతోంది. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేది. అక్కడే ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. సాప్ట్‌వేర్ పేరు పెట్టింది బెంగళూరే.. తర్వాత పుణె కూడా అలా పేరు గడించింది. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. ఇక్కడే అన్నీ కంపెనీలు కొలువుదీరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+