తీపికబురు.. మూడురోజులు తెలంగాణలో తేలికపాటి వాన.. హమ్మయ్యా.. కానీ
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ఈ కబురుతో తెలంగాణ జనం సంబరపడిపోతున్నారు. వాతావరణం కాస్త చల్లబడుతుందని ఆశగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. మంగళవారం ఉదయం అంచనా ఆధారంగా వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సో బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జాగ్రత్తగా ఉండాలని.. బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది.
గతేడాది కన్నా ఎక్కువగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కూలీలు, ఇతర రంగాలకు చెందిన కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications